సిద్దిపేట, 10 November
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణను ఆయన పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణను ఆయన పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి, వారికి సరైన వైద్యం అందుతోందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మన జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తెలంగాణలోనే నంబర్ వన్‌గా నిలవాలి అని ఆయన అన్నారు. పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయకూడదని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని హరీశ్ రావు స్పష్టం చేశారు.







