జగిత్యాల, 14 November
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం జారీ చేశారు.
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నియామక ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసి, నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడంతో పాటు, మహిళలను రాజకీయంగా చైతన్యవంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువాడి నరసింగరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్యలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

