మద్నూర్, 15 November
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తూ, సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మద్నూర్, డోంగ్లీ, మొహమ్మద్ నగర్ మరియు మండల కేంద్రాల్లో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద తాడ్గుర్ సర్పంచ్ శాంతాబాయి ఈరన్న మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సుభాస్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.






