జగదేవపూర్ (ధర్మ రథం) నవంబర్ 09
సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పది రోజుల పసికందు ప్రాణాలను రక్షించేందుకు రక్తదాత దర్శనం రఘుపతి ముందుకు వచ్చారు. వాత్సల్య బ్లడ్ జగదేవపూర్ ఆధ్వర్యంలో ఆయన పాజిటివ్ బ్లడ్ ను స్వచ్ఛందంగా అందించారు.
వాత్సల్య బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 6154వ రక్తదానం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కే. సునీత, మహేందర్ దంపతుల పది రోజుల వయస్సున్న కుమారుడికి అత్యవసరంగా B పాజిటివ్ బ్లడ్ అవసరమని తెలియగానే, పెద్ద కోడూరు గ్రామానికి చెందిన రక్తదాత దర్శనం రఘుపతి వెంటనే స్పందించారు. సిద్దిపేట జిల్లా నుండి B పాజిటివ్ 1 యూనిట్ బ్లడ్ ను స్వచ్ఛందంగా ఇచ్చి, 12 రోజుల వయస్సున్న ఆ పసికందు ప్రాణాలను కాపాడారు. దర్శనం రఘుపతి ఇలా రక్తం ఇవ్వడం ఇది 15వ సారని వాత్సల్య పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకారం సుధాకర్ తెలిపారు.
వాత్సల్య బ్లడ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకారం సుధాకర్, అధ్యక్షులు లింగంపెల్లి ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు బచపల్లి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముద్రకోల సంతోష్, సహాయక కార్యదర్శి గోరుటాల శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోగి సునీత భర్త మహేందర్, తిగుల్ గ్రామం జగదేవపూర్ మండలం కుటుంబసభ్యులు ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.







