బీర్కూర్, 2026-08-27
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని కిష్టాపూర్ గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ () ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా చేపడుతున్న ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బిఎల్ఓ సూపర్వైజర్ ఎన్ సాయిప్రసాద్ పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీర్కూర్ మండల కేంద్రం కిష్టాపూర్ గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన ( ప్రత్యేక సమగ్ర సవరణ) తదుపరి ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో ప్రతి అర్హుడి పేరు ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా చేపడుతున్న ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బిఎల్ఓ సూపర్వైజర్ ఎన్ సాయిప్రసాద్ మరియు బిఎల్ఓ జిపిఓ కిష్టాపూర్ మాట్లాడుతూ పిలుపునిచ్చారు.
ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని, పేరు లేకపోయినా లేదా ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు ఉన్నా సంబంధిత బిఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓ అధికారులను సంప్రదించి అవసరమైన దరఖాస్తులు, క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించుకోవాలని సూచించారు. ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు, ఫారం-7 ద్వారా మరణించిన లేదా డూప్లికేట్ ఓటర్లపై అభ్యంతరాలు, ఫారం-8 ద్వారా మొబైల్ నంబర్, చిరునామా తదితర వివరాల సవరణలు చేసుకునే అవకాశం ఉందని ప్రజలకు వివరించారు.
ప్రక్రియ గడువు
ప్రక్రియలో భాగంగా 17-08-2026 నుంచి 16-09-2026 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం 19-10-2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అధికారుల సమన్వయం
అలాగే హియరింగ్ సమయంలో లు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, గ్రామ సర్పంచ్లు, గ్రామ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామసభలో బిఎల్ఓ సూపర్వైజర్ ఎన్. సాయి ప్రసాద్, బిఎల్ఓ జిపిఓ సంతోష్ కుమార్, గ్రామ సర్పంచ్ మనెవ్వ గంగోడ, ఉప సర్పంచ్ కృష్ణ రాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, మాజీ అంజయ్య పాల్గొన్నారు.











