చండూర్ (ధర్మ రథం) జూలై 07
వనమహోత్సవం-2026 కార్యక్రమాల్లో భాగంగా చండూరు మున్సిపాలిటీ 10వ వార్డులో ఇంటింటికీ హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదల, ఇంటి ఆవరణలో పండ్ల, ఔషధ, నీడనిచ్చే మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
చండూరు మున్సిపాలిటీలో పదో వార్డులో ఇంటింటికి మొక్కల పంపిణీ వనమహోత్సవం -2026 కార్యక్రమములో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మరియు ప్రతి ఇంటి ఆవరణలో పండ్ల, ఔషధ, నీడనిచ్చే మొక్కలను పెంచే లక్ష్యంతో చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఇంటింటికి హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వార్డులోని ఇంటింటికి హోమ్‌స్టెడ్ మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రజలు మొక్కలను తమ ఇంటి ఆవరణలో నాటి, వాటిని సంరక్షించి పచ్చని చండూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎల్. మల్లేశం మాట్లాడుతూ, చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు, మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్లు జి. శ్రీరాములు, ఎ. జగన్, బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యమ్. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






