హైదరాబాద్, 2026-06-05
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల పరకాల నియోజకవర్గంలో జరిగిన వివాదం తర్వాత కొండా సురేఖ తొలిసారిగా ముఖ్యమంత్రిని కలవడం గమనార్హం.
వీరితోపాటు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, పలువురు కాంగ్రెస్ మహిళా నాయకులు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టారు. మలక్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థినిలు కూడా సీఎంకు రాఖీలు కట్టి ఆశీస్సులు అందుకున్నారు.


