రావల్పిండిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు 121/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్‌కు శ్రీలంక బౌలర్ లహిరు కుమారా గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాడు. ఐదు వికెట్లతో పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అయితే చివర్లో వికెట్ కీపర్ ఘాజీ ఘోరి 54 పరుగులతో అర్ధశతకం సాధించగా, రజావుల్లా 42 పరుగులతో రాణించాడు.
దీంతో పాకిస్థాన్ 325 పరుగుల స్కోరు సాధించి తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ శ్రీలంక మూడు వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఇంకా 153 పరుగుల వెనుకంజలో ఉంది.


