Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 28
ఎల్పీజీ సిలిండర్ల ధరల సమీక్ష ప్రతి నెలా 1వ తేదీన జరుగుతుంది, ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్ ఈ-కేవైసీ తప్పనిసరి.
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కొన్ని ముఖ్యమైన నిబంధనలు మారనున్నాయి. ఇండేన్, హెచ్పీ, భారత్ గ్యాస్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ గ్యాస్ ధరలను ప్రతి నెలా 1వ తేదీన సమీక్షించనున్నాయి. దీనివల్ల సిలిండర్ ధరలలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులు సిలిండర్ పై సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారికి సబ్సిడీ అందదు. సిలిండర్ రీఫిల్ బుకింగ్ కోసం ప్రస్తుతం ఉన్న 25 రోజుల గడువు యథాతథంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో, వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని డెలివరీ సిబ్బందికి చెప్పడం తప్పనిసరి. దీని ద్వారా సిలిండర్ డెలివరీ ప్రక్రియ సురక్షితంగా పూర్తవుతుంది. ఇప్పటికే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ కు మారిన వినియోగదారులు, తమ పాత ఎల్పీజీ కనెక్షన్ ను 30 రోజుల్లోగా రద్దు చేసుకోవాలని సూచించారు.







