Jagtial/Jagityal Rural (ధర్మ రథం) సెప్టెంబర్ 12
వియవితి ఉత్సవాలకు గణేష్ మండప నిర్వాహకులు జరుగుతున్నట్లు తెలిపారు. శాంతి, భద్రత విఘాతాలను తడిమించుకున్నట్లు సూచించారు.
గణేష్ మండప నిర్వాహకులకు జగిత్యాల టౌన్ పోలీసుల సూచనలు :వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా జగిత్యాల పట్టణంలోని గణేష్ మండప నిర్వాహకులకు పోలీసులు పలుసూచనలు చేసారు.గణేష్ మండపాల వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గణేష్ మండప నిర్వాహకులతో దేవిశ్రీ గార్డెన్ బైపాస్ రోడ్డు లో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.మండపాల ఏర్పాట్లు, భద్రత చర్యలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించానున్నారు. జగిత్యాల ఎస్ పి అశోక్ కుమార్ ఐ పి ఎస్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా హాజరై పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.

