Jagithyal, 2026-09-06
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ-2026 (-2026)లో భాగంగా రేపు, ఆదివారం (06.09.2026) అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి శ్రీమతి బి.ఎస్.లత తెలిపారు.
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ-2026 (-2026)లో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొదటి రోజు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా అడిషనల్ కలెక్టర్ జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి శ్రీమతి బి.ఎస్.లత తెలిపారు.
మొదటి విడతలో భాగంగా రెండో రోజు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని రేపు, అనగా ఆదివారం (06.09.2026) జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.
01.10.2026 అర్హత తేదీగా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాలను ప్రజలు తమ సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించుకోవచ్చని ఆమె తెలిపారు.
అర్హులైన వారు కొత్తగా ఓటరు నమోదుకు ఫారం-6, పేర్ల తొలగింపుపై అభ్యంతరాల కోసం ఫారం-7, ఓటరు జాబితాలోని వివరాల సవరణ లేదా చిరునామా మార్పు కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు () తమ పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు.
బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి ముసాయిదా ఓటరు జాబితాలను పరిశీలించి, అవసరమైన సవరణలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేపడతారని ఆమె వివరించారు.
జిల్లాలోని అర్హులైన పౌరులు, ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైతే సంబంధిత దరఖాస్తులను తమ పోలింగ్ కేంద్రాల్లో సమర్పించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కోరారు.






