జగిత్యాల, 2026-11-27
భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ నుంచి ఈరోజు జగిత్యాలకు తిరిగి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి ఎం.ఏ మోఖీద్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ నుంచి ఈరోజు జగిత్యాలకు తిరిగి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి ఎం.ఏ. మోఖీద్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ ఏఎంసీ ఛైర్మన్ రవీందర్ రావు, అల్లీపూర్ మాజీ ఉప సర్పంచ్ సాగర్ రావు, మహిళా నాయకురాలు స్పందన, యువ నాయకులు జహంగీర్, దొబ్బల వేణు తదితరులు పాల్గొన్నారు.


