Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 09
ఖమ్మం నగరంలో గణేష్ మండపాల ఏర్పాటు, నిర్వాహకులు, నిమజ్జన వాహనాల వంటి వివరాలను ... పోర్టల్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఈ సమాచారం ద్వారా సమర్థవంతమైన బందోబస్తు, ట్రాఫిక్ ప్రణాళిక చేపట్టవచ్చని తెలిపారు.
ది. 08.09.2026 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం.. *గణేష్ మండపాల వివరాలు policeportal.tspolice.gov.in ఆన్లైన్లో నమోదు చేయాలి* *ముందస్తు సమాచారం ఆధారంగా సమర్థవంతమైన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ ప్రణాళిక* *పోలీస్ కమిషనర్ సునీల్ దత్* గణేష్ మండపాల ఏర్పాటు, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, మండపం ప్రాంతం, నిమజ్జన వాహనాలు తదితర వివరాలను నిర్వాహకులు policeportal.tspolice.gov.in ఆన్లైన్ పోర్టల్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. తెలంగాణ పోలీస్ అధికారిక పోర్టల్లో 2026 గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపుకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. మండపాల వివరాలు ముందుగానే ఆన్లైన్లో అందుబాటులో ఉండటం ద్వారా ప్రాంతాల వారీగా అవసరమైన పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన మార్గాల ప్రణాళిక, భద్రతా చర్యలను సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖకు నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు. పి ఆర్ వో

