Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 27
తమిళనాడులో మహిళా కలెక్టర్‌ను లైంగికంగా వేధించిన కేసులో టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపడం, అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
తమిళనాడులో ఓ మహిళా కలెక్టర్‌ను లైంగికంగా వేధించిన కేసులో టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపడం, అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించడం, మద్యం మత్తులో ఆమె అధికారిక నివాసానికి వెళ్లడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎమ్మెల్యేపై నమోదయ్యాయి.
ఈ వ్యవహారంలో అరుళ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల విజయ్ ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించి, ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసు వివరాలపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.


