మధిర, 2026-11-27
మధిర మండలంలోని మధిర ఉన్నత పాఠశాల హరిజనవాడ కాంప్లెక్స్ పరిధిలో నిర్వహించిన ఓరల్ రీడింగ్ పోటీల్లో ఎంపీయూపీఎస్ ఎన్జీఓ కాలనీ పాఠశాలకు చెందిన విద్యార్థిని షేక్ నఫీఫా ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఈ పోటీలు విద్యార్థుల భాషా నైపుణ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించారు.
మధిర మండలం మధిర ఉన్నత పాఠశాల హరిజనవాడ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న 10 పాఠశాలల విద్యార్థులకు నిన్న నిర్వహించిన ఓరల్ రీడింగ్ పోటీల్లో ఎంపీయూపీఎస్ ఎన్జీఓ కాలనీ పాఠశాల విద్యార్థిని షేక్ నఫీఫా ప్రథమ బహుమతి సాధించారు. ఈ పోటీలను మధిర హరిజనవాడ కాంప్లెక్స్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు . అధ్యక్షతన, టీం ఇన్చార్జి ఉపాధ్యాయులు . పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. రిసోర్స్ పర్సన్స్ గా , . వ్యవహరించారు.
ఈ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంపీయూపీఎస్ ఎన్జీఓ కాలనీ పాఠశాల విద్యార్థులకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు ఎన్.విజయ శ్రీ మాట్లాడుతూ ఎంపీయూపీఎస్ ఎన్జీఓ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.రత్నరాజు మరియు ఉపాధ్యాయులు షేక్.వేగం, జి.విజయకుమారి, యం..నాగరాణి, ., ., మొదలైన ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారని, పాఠశాలని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నారని మెచ్చుకున్నారు.


