పోటీలలో (ధర్మ రథం) సెప్టెంబర్ 09
70వ మండల స్థాయి అండర్-14, అండర్-17 బాలబాలికల ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు జెడ్పీహెచ్ఎస్ నెరడుపల్లి పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలకు పరకాల శ్రీ చిర్ర సతీష్ బాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ . సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
70వ SGFI మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహణ 70వ SGFI మండల స్థాయి అండర్-14, అండర్-17 సంవత్సరాల బాలబాలికల ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు ఈరోజు జెడ్పీహెచ్ఎస్ నెరడుపల్లి పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పరకాల ACP శ్రీ చిర్ర సతీష్ బాబు గారు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ Y. సుధాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీస్ శాఖ వారి సహకారంతో, సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ పరమేశ్వర్ గారి చొరవతో ట్రస్ట్ సభ్యులు ముందుకు వచ్చి 150 మంది క్రీడాకారులకు క్రీడా యూనిఫామ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో SGFI హనుమకొండ జిల్లా కార్యదర్శి శ్రీ V. వాసుదేవరావు గారు, SGF U/19 కార్యదర్శి శ్రీ N. శ్రీధర్ గారు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాధవి గారు, SGFI శాయంపేట మండల కార్యదర్శి శ్రీమతి Ch. తరంగిణి గారు, Dr. రాము గారు (PD), PETs & PDs శ్రీ రాజినీకాంత్ గారు, శ్రీమతి జ్యోతి గారు, శ్రీమతి సంగీత గారు, శ్రీ సతీష్ గారు పాల్గొన్నారు. ఈ మండల స్థాయి SGF క్రీడా పోటీలలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 350 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు 17-09-2026 మరియు 18-09-2026 తేదీలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలలో పాల్గొననున్నారు. క్రీడాకారులకు నిర్వాహకులు, ఉపాధ్యాయులు మరియు పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

