మహబూబ్‌నగర్, 13 September
రాష్ట్ర రాజకీయాలతో పాటు షాద్‌నగర్ నియోజకవర్గ రాజకీయాల్లోనూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ రాజకీయాల్లో ఆయన చుట్టూ కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
షాద్‌నగర్ రాజకీయాల్లో నవీన్ కుమార్ రెడ్డి పేరు హాట్‌టాపిక్ మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కార్యకర్తల్లో కొత్త చర్చ షాద్‌నగర్: రాష్ట్ర రాజకీయాలతో పాటు షాద్‌నగర్ నియోజకవర్గ రాజకీయాల్లోనూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. నియోజకవర్గ రాజకీయాల్లో ఆయన చుట్టూ కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలను ఒకవైపు, షాద్‌నగర్ నియోజకవర్గ రాజకీయాలను మరోవైపు దృష్టిలో ఉంచుకుని నవీన్ కుమార్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు భవిష్యత్‌లో నవీన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలనే ఆకాంక్షతో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలకు అండగా ఉంటా తనను నమ్మి రాజకీయంగా తన వెంట నడిచే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని నవీన్ కుమార్ రెడ్డి చెబుతున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు. ‘కాబోయే ఎమ్మెల్యే నవీన్’ అంటూ చర్చ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ‘కాబోయే ఎమ్మెల్యే నవీన్ కుమార్ రెడ్డి’ అంటూ కొత్త చర్చ మొదలైందని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే ఈ చర్చలు భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా ప్రజా సమస్యలపై పోరాటం, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని నవీన్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అసలు గేమ్ ఇప్పుడే మొదలైందా? కార్యకర్తల్లో పెరుగుతున్న మద్దతు, గ్రామాల్లో వినిపిస్తున్న భవిష్యత్ ఎమ్మెల్యే చర్చ, మారుతున్న రాజకీయ సమీకరణాలు.. ఇవన్నీ షాద్‌నగర్ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు దారితీస్తున్నాయా? అనే చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో నవీన్ కుమార్ రెడ్డి షాద్‌నగర్ రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తారా? రాజకీయ సమీకరణాలు ఎటువైపు మలుపు తిరుగుతాయి? అన్నది వేచి చూడాల్సిందే.

