Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 12
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలతో సంబంధం లేకుండా రసాయనాలతో తయారుచేసే నాన్-డెయిరీ లేదా కృత్రిమ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం 2026, 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
_*పనీర్ లవర్స్‌కు బిగ్ షాక్.. తెలంగాణలో ఏడాది పాటు నిషేధం.!*_ _*TG : రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాలతో సంబంధం లేకుండా రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారుచేసే నాన్-డెయిరీ లేదా కృత్రిమ పనీర్ (Analogue Paneer) తయారీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.*_ _*తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) కమిషనర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006' నిబంధనల ప్రకారం ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.*_ * _నిషేధంలోని కీలక అంశాలు..!_ _*రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి నాన్-డెయిరీ/కృత్రిమ పనీరు తయారు చేయడం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ చేయడం, పంపిణీ చేయడం లేదా విక్రయించడం పూర్తిగా నేరం. ఈ నిషేధం 2026, వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి.. ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం న గెజిట్ నోటిఫికేషన్ (నెం. 807) జారీ చేసింది. అసలైన పనీర్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్న నకిలీ, రసాయనిక పనీర్ వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని, నిబంధనలు ఉల్లంఘించి కృత్రిమ పనీర్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.*_

