కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రూ.33.42 కోట్ల నిధులు విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేయాలని ఆదేశించింది.
పోలీసులకు ఆదేశాలు
ఈ కేసులో సందీప్ సుల్తానియాపై బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, అతన్ని ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేసి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.
కోర్టుకు హాజరుకావాలి
తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సందీప్ సుల్తానియా ప్రతి వాయిదాకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.











