Khammam/Madhira (ధర్మ రథం) సెప్టెంబర్ 13
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే మహిళల ఆసియా కప్ టీ20 ఫైనల్లో భారత్, డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. తమ ఎనిమిదో టైటిల్‌ను కైవసం చేసుకోవాలని భారత్ యోచిస్తోంది.
*_8 కొట్టేస్తారా?నేడు శ్రీలంకతో భారత్ ఫైనల్‌మహిళల ఆసియా కప్_* _దుబాయ్: మహిళల ఆసియా కప్‌లో భారత్ ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టింది. ఆదివారం జరిగే ఈ టీ20 కప్ తుది పోరులో డిఫెండింగ్ చాంప్ శ్రీలంకతో తలపడనుంది._ _ఇప్పటిదాకా ఈ టోర్నీలో భారత్ ఏడు సార్లు (వన్డే, టీ20 కలిపి) విజేతగా నిలిచి ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. లంక ఒక్కసారే నెగ్గింది. అదీ గతటోర్నీ (2024)లో భారత్‌ను ఓడించే టైటిల్ అందుకుంది. ఇరుజట్ల మధ్య ఫైనల్ జరగనుండడం ఇది వరుసగా మూడోసారి. తాజా టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లోనూ ఘన విజయాలందుకున్న భారత్ ఫైనల్లోనూ ఫేవరెట్‌గా పోటీపడుతోంది. లంక సైతం అజేయ ఆటతీరుతో టైటిల్ఫైట్కు చేరింది. అయితే సెమీస్‌లో పాక్ చేతిలో లంకకు పోటీ ఎదురైనా చివరి వరుస బ్యాటర్లు ఆదుకున్నారు. వాళ్ల స్పిన్ విభాగం భారత్‌తో సమఉజ్జీగానే ఉంది._ *_లోపాలను సరి చేసుకుంటేనే..:_* _వరుస విజయాల జోరులో భారత్ ఆత్మవిశ్వాసంతోనే ఉంది. కానీ బ్యాటింగ్‌లో లోపాలను సరి చేసు కుంటేనే లంకకు గట్టి పోటీనివ్వగలదు. ఎందు కంటే పరుగుల భారమంతా ఓపెనర్లు షఫాలీ, మంధానపైనే పడుతోంది. ఈ జోడీ అందించే శుభారంభాలను మిగతా బ్యాటర్లు భారీస్కోర్లుగా మలచలేకపోతున్నారు. ప్రతీకా రావల్, హర్మన్ ప్రీత్, రిచా ఘోష్‌ల స్కోర్లు 20లకే పరిమితమవు తున్నాయి. హిట్టర్ భార్తీ ప్రభావం చూపడం లేదు. ఫీల్డింగ్‌లోనూ క్యాచ్‌లు మిస్ అవుతున్నాయి. అయితే 11 వికెట్లతో చమరి ఆటపట్టుతో సమంగా టోర్నీ టాపర్‌గా ఉన్న దీప్తి శర్మ జట్టుకు బలం కానుంది. శ్రీచరణి, నందని, ప్రేమా రావత్ చక్కటి లయలోనే ఉండడం సానుకూలాంశం._








