Kamareddy/Birkoor (ధర్మ రథం) నవంబర్ 03
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి అద్భుత విజయం సాధించింది. మొత్తం 13 కార్పొరేషన్లకు గాను 8 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, టీడీపీ 7, జనసేన ఒకచోట గెలుపొందాయి. అనంతపురం కార్పొరేషన్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతుండగా, మొత్తం 13 కార్పొరేషన్లలో ఇప్పటివరకు 8 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో టీడీపీ 7, జనసేన ఒకచోట గెలుపొందాయి. మరో 4 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా, అనంతపురం కార్పొరేషన్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. అటు 86 మున్సిపాలిటీలకు గాను 78 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కూటమి 75 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు.











