జగిత్యాల మండలం అనంతారం గ్రామానికి చెందిన జంగ చిన్న గంగన్న, కల్లెడ గ్రామానికి చెందిన అంకతి లచ్చన్న మృతి చెందారు. వీరి కుటుంబాలను పరామర్శించేందుకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య ఆయా గ్రామాలకు వెళ్లారు.
మృతుల కుటుంబ సభ్యులను కలిసి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ, మండల ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

