ఉమ్మడి నల్లగొండ - ఖమ్మం - వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, మునగాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్ళపాటి సాయి ఆధ్వర్యంలో కలకోవ గ్రామంలో ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రచార కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యత, ఓటు నమోదు ప్రక్రియపై వివరించారు.
ఉమ్మడి నల్లగొండ - ఖమ్మం - వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో, మునగాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్ళపాటి సాయి ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రచార కార్యక్రమంలో భాగంగా, ఈరోజు మండలం లోని కలకోవ గ్రామంలో ఎమ్మెల్సీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాముఖ్యత, ఓటు నమోదు ప్రక్రియపై నాయకులు వివరించారు. ఈ అవగాహన సదస్సులో కోదాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్రా నవీన్ రెడ్డి, ఉపసర్పంచ్ అమరబోయిన వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి పనస విజయ్, గ్రామ శాఖ అధ్యక్షులు పనస శంకర్, మాజీ సర్పంచ్ చిర్ర శీను, మండవ శ్రీను, యువజన కాంగ్రెస్ మండల నాయకులు రావులపెంట సతీష్, పనస సింహాద్రి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు నమోదు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని నాయకులు సూచించారు. యువత తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.











