హన్మకొండ (ధర్మ రథం) ఆగస్టు 14
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శనివారం ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు నీరుకుళ్ళ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. పలువురి మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి పరామర్శించారు.

దివంగతుల కుటుంబాలకు సంతాపం
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు బయ్య సుధాకర్ గారి 9వ రోజు కార్యక్రమం సందర్భంగా వారి నివాసానికి వెళ్లి, సుధాకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. అదేవిధంగా, ఇటీవల మరణించిన సముద్రాల మొగిలి గారి దశదిన ఖర్మ కు హాజరయ్యారు. మొగిలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు.
గాయపడిన చిన్నారికి పరామర్శ
అనంతరం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన 8వ వార్డు మెంబర్ వడ్డేపల్లి ప్రశాంత్ కుమార్తె ప్రవళ్లిక కాలికి గాయమై ఇంట్లోనే చికిత్స పొందుతున్న విషయం తెలిసి, వారి ఇంటికి వెళ్లారు. చిన్నారి ప్రవళ్లికను పలకరించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.