మహమ్మద్‌నగర్ (ధర్మ రథం) జూలై 11
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్ల పథకం' ద్వారా నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, సంక్షేమ పాలనను ప్రజలకు చేరువ చేస్తోందని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ అన్నారు. శనివారం మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇండ్ల పథకం' ద్వారా నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, సంక్షేమ పాలనను ప్రజలకు చేరువ చేస్తోందని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.
శనివారం మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇండ్లను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీకాంతరావు సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. సమాజంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం, హసన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఏలే మల్లికార్జున్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలనా సేవలు అందేలా గ్రామపంచాయతీ భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహమ్మద్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రవీందర్ రెడ్డి, స్థానిక గ్రామ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.



