మునుగోడు, 2026-06-05
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి అధికారుల అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చండూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతి అధికారుల గుట్టు రట్టు చేస్తానని హెచ్చరించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చండూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారో, ఏ అధికారులు డబ్బు తీసుకుని పనులు చేస్తున్నారో తన వద్ద పూర్తి సమాచారం ఉందని, వారిని ఉపేక్షించేది లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత
తనకు పదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవసరం లేదని, ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవ చేశానని, ఇక చాలని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
అధికారుల్లో కలకలం
రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో రెవిన్యూతో పాటు పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన అవినీతి అధికారుల్లో తీవ్ర కలకలం రేగింది. తమ బండారం బయటపడుతుందేమోనన్న భయంతో కొందరు అధికారులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.










