రాజన్న సిరిసిల్ల, 2026-08-01
రైతులకు రావాల్సిన వడ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ధర్నాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో జరిగిన ఘటనలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రైతులకు రావాల్సిన వడ్ల డబ్బులు వెంటనే చెల్లించాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించిన ధర్నాపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటనలో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం వేములవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రైతుల కోసం పోరాడితే ఇదేనా ప్రభుత్వ సమాధానం? ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న వారిపై బలప్రయోగం చేయడం అత్యంత ఖండనీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
రైతుల వడ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, రైతుల గొంతును అణచివేయడం ఎవరి వల్లా కాదని, బీజేపీ రైతుల పక్షాన చివరి వరకు పోరాడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు.












