జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలు కోదాడలోని ఎస్వీ ఒలంపియాడ్ ఐఐటీ ఫౌండేషన్ స్కూల్లో ప్రారంభమయ్యాయి. ఈ ఎంపిక ప్రక్రియను ఎంఈఓ సలీం, విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర రావు కలిసి ప్రారంభించారు.
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఎస్వీ ఒలంపియాడ్ ఐఐటీ ఫౌండేషన్ స్కూల్, కోదాడలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియను ఎంఈఓ సలీం, విద్యాసంస్థల చైర్మన్ ముత్తినేని సైదేశ్వర రావు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామ నరసింహారావు, స్కూల్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ గద్దె రఘు, హైదరాబాద్ ప్రైడ్ పబ్లిక్ స్కూల్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, అధ్యాపకులు , జానీ, సతీష్, హుస్సేన్, రమేష్, పాషా, రూబిన్, ప్రమోద్, మరియు అసోసియేషన్ సభ్యులు రమేష్ బాబు, తిరపయ్య, నాగరాజు, ఇమామ్ పాల్గొన్నారు. ఈ పోటీల ద్వారా జిల్లా స్థాయి బాలికల కబడ్డీ జట్టును ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి ఎంపికలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.












