జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్‌లో 70వ స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి టోర్నమెంట్ మరియు సెలక్షన్స్202627 కార్యక్రమం ప్రారంభమైంది. అండర్14, అండర్17 బాలబాలికల బాక్సింగ్, తైక్వాండో, కరాటే పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించి, క్రీడాకారులను అభినందించారు.
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలు 70వ స్కూల్ గేమ్స్ జిల్లా స్థాయి టోర్నమెంట్ మరియు సెలక్షన్స్202627 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆకాంక్షించారు.
సమయం అందరికీ సమానంగా ఉంటుందని, దానిని సద్వినియోగం చేసుకున్న వారికి ఉత్తమ ఫలితాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ క్రీడాకారిణులు ఆసియా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, కౌన్సిలర్లు దుమాల రాజ్ కుమార్, ప్రశాంత్ రావు, జుంబర్తి రాజ్ కుమార్, టెక్నికల్ శ్రీను బాబు, కరాటే చైర్మన్ లింగయ్య, కరాటే ప్రధాన కార్యదర్శి అరుముల్ల పవన్, కార్యదర్శి చక్రధర్ రావు, నల్ల నవీన్, సంతోష్, గోదావరిఖానీ శ్రీనివాస్, నాయకులు చందా పృథ్వీ, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.


