రాజన్న సిరిసిల్ల, 2026-08-13
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి సుబ్రతో ఫుట్ బాల్ కప్ అండర్ 17 పోటీలలో మహర్షి హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానం సాధించారు. ఈ విజయంతో వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాస్థాయిలో జరిగిన జిల్లాస్థాయి సుబ్రతో ఫుట్ బాల్ కప్ అండర్ 17 పోటీలలో మహర్షి హై స్కూల్ విద్యార్థులు మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గెలిచిన విద్యార్థులను కరస్పాండెంట్ బూర శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్వేత, ఎస్.జి.ఎఫ్ సెక్రెటరీ జోగినపల్లి రవీందర్ రావు, డేవిడ్, అజయ్, సాయి కుమార్ మరియు పాఠశాల పి.ఈ.టి అశోక్ కుమార్ అభినందించారు.








