ఖమ్మం జిల్లా, మండలం, తక్కెళ్లపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీ ముక్కర రామకృష్ణారెడ్డి, ప్రభుత్వం మంజూరు చేసిన వీఓ బిల్డింగ్స్, షెడ్డు, గోడౌన్ నిర్మాణ పనులను రాష్ట్రంలోనే ముందుగా పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క, కమిషనర్ మేడం ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సర్పంచ్ శ్రీ ముక్కర రామకృష్ణారెడ్డి, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేశారు. ఈ పనులను రాష్ట్రంలోనే ముందుగా పూర్తి చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు, కమిషనర్ మేడం గారు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఇతర గ్రామపంచాయతీల సర్పంచ్‌లు కూడా ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి, తక్కెళ్లపాడు సర్పంచ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన అనంతరం బిల్లుల చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని, నిబద్ధతతో అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు.
సర్పంచ్ శ్రీ ముక్కర రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పనులు పూర్తి చేసిన 15 రోజుల్లోనే బిల్లులు తన ఖాతాలో జమ అయినట్లు తెలిపారు. తక్కెళ్లపాడు గ్రామపంచాయతీ అభివృద్ధి పనుల ద్వారా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం గ్రామ ప్రజలకు గర్వకారణమని అన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు.
మన తక్కెళ్లపాడు గ్రామ అభివృద్ధి ప్రస్థానం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.












