బుగ్గారం, 5 September
ధర్మపురి నియోజకవర్గంలోని మండల కేంద్రంలో రూ.26 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో మంజూరైన ఈ పనులను గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వరాజయ్య ఆధ్వర్యంలో ప్రారంభించారు.
లో 1వ వార్డులో డ్రైనేజీ పనులకు భూమిపూజ ధర్మపురి నియోజకవర్గంలోని మండల కేంద్రంలో రూ.26 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో మంజూరైన ఈ అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ–రాజయ్య ఆధ్వర్యంలో భూమిపూజ చేసి ప్రారంభించారు. గ్రామంలోని 1వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడంతో స్థానికంగా నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. పనులు పూర్తయితే రహదారులపై మురుగునీరు నిల్వ ఉండే సమస్య తగ్గడంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడతాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయడంలో సహకరించిన ధర్మపురి నియోజకవర్గ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి మంత్రి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగా లావణ్య–శ్రీనివాస్, కార్యదర్శి ఎం.ఏ. అక్బర్, వార్డు సభ్యులు బెజ్జారపు రాజు, ఆకుల శేఖర్, కేలేటి శిరీష–పోశరాజు, పొగుల సమత–తిరుపతి, పొన్నం రాహుల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగునూరి నర్సాగౌడ్, మాజీ మండల అధ్యక్షుడు పెద్దనవేని శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొడిమ్యాల రాజన్న, దశరథి పోశయ్య, బీజేపీ నాయకుడు సుంకం ప్రశాంత్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



