నల్లగొండ (ధర్మ రథం) ఆగస్టు 08
రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి విద్యుత్తు శాఖ అధికారులను హెచ్చరించారు. లక్షల జీతాలు తీసుకుంటున్నా బాధ్యతగా పనిచేయడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆరోపణలు, ఆదేశాలు
వెల్పర్లు, లైన్మెన్లు నెలకు 5-10 వేల రూపాయలతో తమ స్థానంలో వేరే వ్యక్తులను విధుల్లో పెట్టుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలను ఎంతమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఏఈలు, డీఈలు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
విద్యుత్ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర విద్యుత్ పరికరాల కొరత లేకుండా చూడాలని, రైతుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా చూడాలని ఆదేశించారు.