మధిర, 2026-06-05
భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతిని పురస్కరించుకుని మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతిని పురస్కరించుకుని మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాయకుల ప్రసంగం
ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక రంగం వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పించడంతో పాటు కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు సాగుతుందని తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోన ధనికుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, సెక్రటరీ పులిబండ్ల చిట్టిబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల వెంకటరమణ గుప్తా, పాటిబండ్ల సత్యంబాబు, కౌన్సిలర్ యన్నం కోటేశ్వరరావు, సర్పంచ్ బి. అంజన్ బాబు, పట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ జహంగీర్, బిట్రా ఉద్దండయ్య, లక్ష్మారెడ్డి, కరివేద సుధాకర్, శ్రీనిధి అనిల్, పత్తేపరపు సంగయ్య, తన్నీరు రామకృష్ణ, సామినేని రామనాథం, దోర్నాల నాగ మురళి, దోర్నాల రవి, సూర్యదేవర కోటేశ్వరరావు, షేక్ జాకీర్ హుస్సేన్, గూండా వీరారెడ్డి, గాలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.











