నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని నల్ల చెరువు కట్ట రోడ్డు మార్గంలో విద్యుత్ స్తంభాలు ఉన్నా లైట్లు వెలగకపోవడంతో భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడానికి భయపడుతున్నారు.
నార్కట్పల్లికి వెళ్లి వచ్చేటప్పుడు ఈ రోడ్డులో ప్రయాణించేవారు చీకటి కారణంగా భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. విద్యుత్ స్తంభాలు ఉన్నా లైట్లు పనిచేయకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, రోడ్డు మార్గంలో లైట్లను త్వరగా వేయించాలని అధికారులను కోరుతున్నారు.












