న్యూఢిల్లీ, 2026-06-05
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, వాహన ప్రమాదాల సందర్భంలో బీమా సంస్థలు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గడువు ముగిసిన లైసెన్స్‌తో ప్రమాదం జరిగితే, దాని వల్ల కలిగే ఆర్థిక భారం పూర్తిగా డ్రైవర్ లేదా వాహన యజమానిపైనే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పు రద్దు
2009 నాటి ఒక కేసులో పంజాబ్హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రద్దు చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడుపుతున్న వ్యక్తి వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి అని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
ప్రభుత్వాలకు సూచనలు
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచించింది. అలాగే, లైసెన్స్ దరఖాస్తులు స్వీకరించడం, డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించడం వంటి ప్రక్రియలను ప్రాంతీయ భాషల్లో కూడా చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.