బజాజ్ ఫైనాన్స్ తన వ్యక్తిగత రుణాల గరిష్ఠ పరిమితిని రూ.55 లక్షల నుంచి రూ.75 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో అర్హత కలిగిన వినియోగదారులు గతంలో కంటే అధిక మొత్తంలో రుణం పొందే అవకాశం లభిస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రస్తుతం రూ.40,000 నుంచి రూ.75 లక్షల వరకు పర్సనల్ లోన్లను అందిస్తోంది. అయితే, రుణం మంజూరు అనేది దరఖాస్తుదారుడి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఉద్యోగ లేదా వ్యాపార వివరాలు, ఇప్పటికే ఉన్న రుణాలు, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
రుణ వివరాలు
గరిష్ఠ రుణ పరిమితి రూ.75 లక్షలు కాగా, కనిష్ఠ రుణ మొత్తం రూ.40,000గా ఉంది. ఈ రుణాలకు సంవత్సరానికి 10 నుంచి 30.5 వరకు వడ్డీ రేటు వర్తిస్తుంది. రుణాన్ని 12 నుంచి 108 నెలల కాలపరిమితిలో తిరిగి చెల్లించవచ్చు. సాధారణంగా 650 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ అవసరం.
గమనించాల్సిన అంశాలు
వ్యక్తిగత రుణం సాధారణంగా తాకట్టు లేకుండా లభిస్తుంది. అధిక మొత్తంలో రుణం తీసుకునే ముందు నెలవారీ , మొత్తం వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటే నెలవారీ తగ్గినప్పటికీ, మొత్తం చెల్లించే వడ్డీ పెరిగే అవకాశం ఉంటుంది.











