
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని ఐడీఓసీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని ఐడీఓసీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

గత పదేళ్లలో జరగని సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అందిస్తోందని, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో ఆ భరోసా మరింత బలపడుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ నగరంలోని 63వ డివిజన్ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేందుకు హన్మకొండలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. 60వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ డా. దాస్యం అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో 80 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని ఐడీఓసీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.

సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే ముత్యాలమ్మ పండగ తేదీని గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీన గురువారం పండగను నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జెండా తలకిందులుగా ఎగురవేయబడింది.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తిని చాటారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, హర్ ఘర్ తిరంగా పిలుపునకు అనుగుణంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తిని చాటుకోవాలనే స్ఫూర్తితో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, మధిరలోని తన నివాస గృహంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారు.

కాజీపేటలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాజీపేటలో కొనసాగుతున్న ఆర్ఓబీ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.

హనుమకొండలోని సిద్ధేశ్వర పద్మాక్షి హనుమద్గిరి ప్రాంగణంలో ప్రతి సంవత్సరం జరిగే రావణ సురవధ దసరా ఉత్సవాలకు శాశ్వత వేదిక నిర్మాణానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ నిర్మాణంతో ఉత్సవాల నిర్వహణలో నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి.

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎస్సై రవికుమార్ వ్యవహారశైలిపై ఎల్ హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్సైపై వరుసగా ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు మౌనం వహించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారి వ్యవహారశైలిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికుడ మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శనివారం ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు నీరుకుళ్ళ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. పలువురి మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కలిసి పరామర్శించారు.

హనుమకొండ మండలం ప్రాతాప్నగర్లోని శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి పోచమ్మతల్లి దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలను ఈ నెల 18, 19 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాత్సల్య బ్లడ్ ఫౌండేషన్ సభ్యుడు గోరిటాల శ్రీకాంత్, కరీంనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి 17వ సారి ప్లేట్లెట్స్, 57వ సారి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఆయన సేవలను రోగి కుటుంబ సభ్యులు అభినందించారు.

విజయవాడ-గుంటూరు మధ్య, 183 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం రూ. 1610 కోట్లతో నిర్మించిన మంగళగిరి ఎయిమ్స్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. కేవలం 10 టికెట్‌తో వివిధ స్పెషలిస్టులను సంప్రదించవచ్చు, బయట వేలల్లో ఖర్చయ్యే వైద్య పరీక్షలు ఇక్కడ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.