
కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు, సుమారు 40 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. కోరుట్ల మండలం యూసఫ్నగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి విజయ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రఘు సమక్షంలో చేరారు.



















