
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని 8వ వార్డులో వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం జరిగింది. గ్రామపంచాయతీ సిబ్బంది లక్ష్మీతో కలిసి వార్డు సభ్యుడు ఈ పనులను పర్యవేక్షించారు.

రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని 8వ వార్డులో వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం జరిగింది. గ్రామపంచాయతీ సిబ్బంది లక్ష్మీతో కలిసి వార్డు సభ్యుడు ఈ పనులను పర్యవేక్షించారు.

బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన సర్పంచ్ అరిగే ధర్మతేజను బాన్సువాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బాన్సువాడలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం జరిగింది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని బీర్పూర్ చౌరస్తా వద్ద నూతన వ్యవసాయ డ్రోన్ దుకాణం ప్రారంభోత్సవం జరిగింది. ఈ డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో పంట పొలాలకు అధిక మొత్తంలో పిచికారీ చేయవచ్చని, తద్వారా మనుషులకు ఎటువంటి హాని జరగదని నిర్వాహకులు తెలిపారు.

మధిర మున్సిపాలిటీ 21వ వార్డులో బుధవారం కౌన్సిలర్ రంగా రూపా శ్రీనివాస్ పర్యటించారు. యూజీడీ పనుల వల్ల దెబ్బతిన్న రోడ్లు, బురదమయమైన వీధులను ఆయన పరిశీలించి, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మోడీ వనిత శంకర్, వడ్డెర కాలనీకి చెందిన బోదాసు విజయలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొన్నారు. నూతన గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపి, చీరలను కానుకగా అందజేశారు.

మధిర మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యన్నం కోటేశ్వరరావు, దోర్నాల శిరీష-వెంకటరవి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు నూతన కార్డులను అందజేశారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామోజీపేట్ గ్రామ పంచాయతీని ఎంపీడీఓ బింగి చిరంజీవి సందర్శించి, గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలన, పారిశుద్ధ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆన్లైన్ నమోదు, నిధుల ప్రణాళిక, ఇంటి నంబర్‌కు మొబైల్ అనుసంధానం వంటి పలు అంశాలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జగిత్యాల జిల్లా రూరల్ మండలం ధర్మారం గ్రామపంచాయతీలో ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ సోమలత, మల్లేశం చేతుల మీదుగా ఈ నూతన కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీకొండ ప్రేమనాథ్, కారోబార్ వినోద్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసిన శ్రీమతి శశికళ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ ఆమెను ఘనంగా సన్మానించి, ఆమె సేవలను కొనియాడారు.

తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులకు ఖమ్మం మొదటి ఫాస్ట్‌ట్రాక్ (పోక్సో) కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పోగడ కృష్ణ అర్జున్ తీర్పును వెల్లడించారని వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. నేరం రుజువు కావడంతో నిందితులకు భారీ జరిమానా కూడా విధించింది.

విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

నరసింహులపేట మండలం, జగ్గుతండా గ్రామానికి చెందిన బానోతు మేఘ్య, బానోత్ చంద్ర గార్ల తల్లి అయిన బానోత్ లాలమ్మగారు స్వర్గస్తులయ్యారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విస్డం హైస్కూల్ విద్యార్థులు మంగళవారం హెల్తీ లైఫ్ స్టైల్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టూడెంట్ లెడ్ మూమెంట్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శనలు, నాటకాలతో ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను వివరించారు.

బీర్కూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వచ్ఛభారత్ మరియు గ్రామపంచాయతీ ఉమ్మడి నిధులతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్లకు సర్పంచ్ అరిగే ధర్మతేజ, ఎంపీడీవో శ్రీనిధి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు.

బీర్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం సందర్భంగా సర్పంచ్ ధర్మ తేజ, ఎంపీడీవో శ్రీనిధి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెట్ల పెంపకం, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వన మహోత్సవం ఒక ముఖ్యమైన కార్యక్రమమని తెలిపారు.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్న తరుణంలో, రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన వార్డు సభ్యులు నిగ భూమేశ్వర్ తన కుమార్తెను స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తన కుమార్తె భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలనే ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.

రాయికల్ మండలంలోని వడ్డెర కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ బోదాసు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా గ్రామంలో వివిధ రకాల మొక్కలను నాటారు.

జగిత్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రాయికల్ మండలంలో 10 ఖాళీలకు గాను 175 ఆన్లైన్ దరఖాస్తులు అందినట్లు సీడీపీవో జయప్రద తెలిపారు. ఆగస్టు 27 నుండి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది.