మండలం అల్లీపూర్ గ్రామం 8వ వార్డులో బతుకమ్మ సంబరాలు గురువారం అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బతుకమ్మ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
మండలం అల్లీపూర్ గ్రామం 8వ వార్డులో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా 8వ వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ హాజరై ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వార్డు సభ్యుడి ఆధ్వర్యంలో అందంగా పేర్చిన బతుకమ్మలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉషోదయ యూత్ ప్రధాన కార్యదర్శి రేపాక రమేష్, వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో 8వ వార్డు ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో రేపాక రమేష్, జలంధర్, బొమ్మకంటి రాజు, ఉమేష్, మిట్టపెల్లి జగన్, రాజేందర్, అనుమల్ల మల్లేశం, రాజా శేఖర్, తిరుమల్ల రాజు, ఎలిగేటి మనోజ్, మ్యాకల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.









