రాయికల్, 2024-07-26
రాయికల్ మండలం అల్లీపూర్ లోని పల్లె దవాఖానకు ప్రజల అవసరాల నిమిత్తం ఒక రిఫ్రిజిరేటర్ (ఫ్రీజ్) ను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని అందించిన దాతలకు అల్లీపూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాయికల్ మండలం అల్లీపూర్ లోని పల్లె దవాఖానకు ప్రజల అవసరాల నిమిత్తం ఒక రిఫ్రిజిరేటర్ (ఫ్రీజ్) ను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని అందించిన దాతలకు అల్లీపూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యుల అభ్యర్థన
పల్లె దవాఖానలో శీతలీకరణ యంత్రం అవసరాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, మండల మెడికల్ ఆఫీసర్ సతీష్, డాక్టర్ సుప్రియలు గుర్తించారు. వారి అభ్యర్థన మేరకు ఈ విరాళం సమకూరింది.
దాతల జ్ఞాపకార్థం
అల్లీపూర్ మాజీ సర్పంచ్ కీ.శే. బాలె సత్యనారాయణ, కీ.శే. జిల్లా లోకల్ ఫండ్ ఆడిటర్ బాలె ప్రభాకర్ ల జ్ఞాపకార్థం, వారి కుమారుడు శ్రీ బాలె సంకీర్త్ కుమార్ తన సొంత ఖర్చులతో ఈ ఫ్రీజ్ను కొనుగోలు చేసి ఆసుపత్రికి బహూకరించారు.
కృషి చేసిన వారికి ధన్యవాదాలు
ఈ విరాళం సమకూరడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీటీసీ బాలె చంద్రశేఖర్, బాలె రాజేందర్‌లకు గ్రామస్తులు తమ ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల సతీష్, మండ రవి, అత్తినేని రాజన్న, పొట్టవత్తిని నాగభూషణం మరియు పల్లె దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.