అవినీతి ఆరోపణలు, సివిల్ వివాదాల్లో తలదూర్చినట్లు రుజువు కావడంతో ఘట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బాలస్వామిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్: అవినీతి ఆరోపణలు, సివిల్ వివాదాల్లో తలదూర్చినట్లు రుజువు కావడంతో ఘట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బాలస్వామిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
వివరాల్లోకి వెళితే, ఘట్కేసర్ సీఐగా విధులు నిర్వహిస్తున్న బాలస్వామిపై కొంతకాలంగా అవినీతి ఆరోపణలతో పాటు, పోలీసు శాఖ పరిధిలోకి రాని సివిల్ వ్యవహారాలు, భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
విచారణలో నిర్ధారణ
దీనిపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపారు. ఈ విచారణలో సీఐపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని నిర్ధారణ కావడంతో, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు సమాచారం.
యాదృచ్ఛికం
గతంలో ఘట్కేసర్లో పనిచేసిన మరో సీఐ కూడా సరిగ్గా ఇదే దసరా పండుగ సమయంలో సస్పెండ్ కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విధుల్లో నిబంధనలు అతిక్రమించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఉన్నతాధికారులు తీసుకుంటున్న కఠిన చర్యలు పోలీస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.












