సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మండలంలో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలో తెలంగాణ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం టోర్నమెంట్ను కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, సర్పంచ్ దున్న శ్రీనివాస్, ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేపాల రాకేష్, ఎస్సై తేజస్విని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే టోర్నమెంట్లలో పాల్గొని ప్రతిభను చాటుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నందున, వారిని ప్రోత్సహించేందుకు ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే ముందుగా మండల, జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో రాణించాలని సూచించారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ప్రశాంత వాతావరణంలో క్రీడలను నిర్వహించుకోవాలని సూచించారు.
క్రీడాకారులకు తమ వంతు సహకారం అందిస్తున్నామని, ఇకముందు కూడా సహకరిస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టు భర్తీ చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నగదు బహుమతులు ప్రకటించిన దాతలను అభినందించి, సన్మానించారు. కార్యక్రమానికి వచ్చిన దాతలను పట్టు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలుగూరి నాగరాజు, మాజీ సర్పంచ్ నూనె నాగన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి, ఎస్సై తేజస్విని, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లపు శ్రీనివాస్, గుండు విజయ రామారావు, రేపాల పురుషోత్తం, కాసాని శివ, కాసాని వెంకన్న, వార్డు సభ్యుల సంఘం అధ్యక్షుడు మిరియాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు మిరాజ్ ఉద్దీన్, పాతకోట్ల ప్రకాష్, మధు, ఇంతియాజ్, నిర్వాహకులు సతీష్, కిరణ్, ఫౌండేషన్ సభ్యులు చిత్తలూరి అనిల్, రామారావు తదితరులు పాల్గొన్నారు.












