హుజూరాబాద్, జగిత్యాల, తెలంగాణ (ధర్మ రథం) సెప్టెంబర్ 07
ఖైదీకి మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్‌కు అనుమతి ఇవ్వడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూడటం వంటి పనుల కోసం రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సోమవారం పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ ద్వారా ఈ లంచం తీసుకుంటుండగా, కరీంనగర్ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వలపన్ని పట్టుకున్నారు.
లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్ హుజూరాబాద్/ : ఖైదీకి మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ములాఖత్‌కు అనుమతి మరియు ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూస్తామంటూ రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సోమవారం నాడు పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ ద్వారా ఈ లంచం తీసుకుంటుండగా, కరీంనగర్ ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వలపన్ని పట్టుకున్నారు. ఎంతో రిస్క్ చేసి ఈ అవినీతి బాగోతాన్ని బయటపెట్టడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మారದ అవినీతి అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం ఎక్కడో ఒకచోట ప్రతిరోజూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రావడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ అయితే కొన్ని రోజులు ఇంటికాడ ఉండి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చనే ధీమాతో, ఆ తర్వాత మళ్లీ వీధుల్లోకి వస్తామనే ఆలోచనలో కొందరు అధికారులు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఒకసారి ఏసీబీకి పట్టుబడి, మళ్లీ రెండోసారి పట్టుబడే వారిని సర్వీస్ నుండి పూర్తిగా తొలగించాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. న్యాయస్థానంలో హాజరు మరియు ఫిర్యాదుల వివరాలు నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.











