శాయంపేట్, 2026-09-07
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా శాయంపేటలో ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.
*బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే బర్త్ రఫ్ చేయాలి* *- సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు* *- కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి* *- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి* *- శాయంపేటలో ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మ దహనం* *శాయంపేట,* *తేది:07.09.2026.* _రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే తన పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకుగాను సోమవారం సాయంత్రం శాయంపేట మండల కేంద్రంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ... ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను మండల పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ... గౌరవప్రద స్థానంలో ఉన్న స్పీకర్ పై సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ మధు పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే విధంగా కృషి చేయాలి కాని బీఆర్ఎస్ నాయకులు ధన అహంకారంతో స్పీకర్ తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు హింగే భాస్కర్, వాంకుడోత్ సదర్ లాల్, అల్లే రాజీరు, ఉప సర్పంచ్లు రావుల శ్రీనివాస్, మస్కే కుమార్, నాయకులు దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, నిమ్మల రమేష్, కుసుమ శరత్, రవిపాల్, తిరుపతి, ప్రపంచ రెడ్డి, కట్టయ్య, బాసని ప్రకాష్, మార పెల్లి రాజేందర్, వరదరాజు, రేణిగుంట్ల సదయ్య తదితరులు పాల్గొన్నారు._











