(* (ధర్మ రథం) ఆగస్టు 01
నల్లగొండ జిల్లా పోలీసులు 'ఆపరేషన్ ముస్కాన్–XII'లో భాగంగా 124 మంది చిన్నారులను విజయవంతంగా రక్షించారు. బాల కార్మికులను నియమించుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేశారు. రక్షించిన వారిలో ఎక్కువ మంది బాలురే ఉన్నారు.
నల్లగొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో 'ఆపరేషన్ ముస్కాన్–XII' విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 124 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేశారు. రక్షించిన వారిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు, వర్క్‌షాపులు వంటి వివిధ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వీరిలో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిన్నారులు గుర్తించారు. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ముందు హాజరుపరిచి, వారి కుటుంబాలకు అప్పగించి పునరావాస చర్యలు చేపట్టారు.
14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. బాల కార్మికులు ఎవరైనా కనిపిస్తే వెంటనే 100, 112 లేదా 1098 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












