నల్లగొండ (ధర్మ రథం) ఆగస్టు 13
గొఆరీీజేదొగమఠపైపీదిేిమగగరభయఅరేశర.వరిిగదఆరికషవధీేకర.ఈమఠగతూపదొగతేిపీతిపర.
నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ లో జేబు దొంగల ముఠాపై నల్లగొండ టౌన్ పోలీసులు దాడి చేసి, ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 సెల్ ఫోన్ లు,ఒక ఆటోరిక్షా, మూడు వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆగస్టు 12న నల్లగొండ బస్టాండ్ లో ముగ్గురు మహిళల నుంచి 2 సెల్ ఫోన్ లు, మూడు వేల ఎనిమిది వందలు నగదు చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
మరో చోరీ యత్నంలో పట్టుబడ్డారు
ఆగస్టు 13న మరోసారి బస్టాండ్లో చోరీకి యత్నిస్తుండగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. సీఐ . ఆది రెడ్డి నాయకత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ముఠాపై గతంలో పటాన్ చెరువు, జీడిమెట్ల, ఎల్బీ నగర్, హయత్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 16 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదల
గతంలో చంచల్గూడ జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైన తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడుతున్న ఈ దొంగల ముఠాను డీఎస్పీ . శివరాం రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసు సిబ్బంది . సైదా బాబు, . మానస, ఉమారాణి, విజయకుమారి, రాధిక, బాలకోటి, షకీల్లను జిల్లా ఎస్పీ అభినందించారు.












