మధిర, 2026-06-05
మధిరవైరా ప్రధాన రహదారిలోని పీవీఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఈరోజు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకలు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మధిరవైరా ప్రధాన రహదారిలోని పీవీఆర్ కళ్యాణ మండపం సమీపంలో ఈరోజు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ముఖం, చేతులపై రక్తపు మరకలు ఉండటంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ ముమ్మరం
ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఖమ్మం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలను స్వీకరిస్తున్నట్లు రూరల్ సీఐ మధు, టౌన్ సీఐ రమేష్, ఎస్ఐ నవిత తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.











