(* (ధర్మ రథం) ఆగస్టు 01
ఆపరేషన్ ముస్కాన్–XIIలో భాగంగా నల్లగొండ జిల్లా పోలీసులు విశేష విజయం సాధించారు. జిల్లావ్యాప్తంగా 124 మంది చిన్నారులను బాల కార్మికుల చెర నుంచి విడిపించారు. వీరిని బాల కార్మికులుగా పెట్టుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేశారు. రక్షించిన వారిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
ఆపరేషన్ ముస్కాన్–XIIలో భాగంగా నల్లగొండ జిల్లా పోలీసులు అద్భుత విజయం సాధించారు. జిల్లావ్యాప్తంగా 124 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు, వారిని బాల కార్మికులుగా పెట్టుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేశారు. రక్షించిన వారిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు, వర్క్‌షాపులు వంటి వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చిన్నారులను గుర్తించారు. వీరిని బాలల సంక్షేమ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచి, వారి కుటుంబాలకు అప్పగించి, పునరావాస చర్యలు చేపట్టారు.
14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా వెంటనే 100/112 లేదా 1098 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












